మోత్కూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్

విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చదరంగం, కరాటే, క్యారం, వాలీబాల్ తదితర క్రీడలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అరవిందరాయుడు, అవిలిమల్లు, రాజు, వెంకట్, వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్