నాగారం: ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరేబోయిన గూడెం రీచ్ నుండి నడుస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కరెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి గద్దగూటి మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విచ్చలవిడిగా ఇసుక ట్రాక్టర్లు గ్రామంలో తిరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్లు రాకుండా చూడాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్