వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబా టులో ఉంటూ సేవలందించాలని సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కోటా చలం సూచించారు. నాగారం పీ. హెచ్. సి సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, కేటగిరీల వారీగా కేటాయించిన సెలవులను మాత్రమే వాడుకోవాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలన్నారు. విధుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవన్నారు.