నాగారం: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా నాగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డా. నాగరాజు సమక్షంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కుటుంబ నియంత్రణ, చిన్న కుటుంబం ఆరోగ్యకరమైన కుటుంబం గురించి అవగాహన నిర్వహించారు. పిహెచ్‌సి సూపర్‌వైజర్ రాంచంద్రు, హెచ్‌ఈ విమల, పిహెచ్‌ఎన్ అరుణ కుమారి, పల్లెదవాఖాన వైద్యులు డా. శ్రావణ్ కుమార్, డా. ఉదయ ప్రణవి, డా. నాజియా, యాదగిరి, ప్రవీణ్ రెడ్డి, ఏఎన్‌ఎంలు ఆశాలు ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్