నూతనకల్: గుండ్ల సింగారం బ్రిడ్జి పనులకు నేడు శంకుస్థాపన

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం గుండ్ల సింగారం వద్ద సూర్యాపేట, దంతాలపల్లి రహదారిలో దాదాపు రూ. 30 కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ కార్యక్రమానికి హాజరై బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్