సూర్యాపేట జిల్లా నూతనకల్ లో గురువారం తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దరమే లక్ష్యంగా పనిచేస్తాననీ తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో వ్యవసాయ మార్కెట్ ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత పాలకులు మార్కెట్ ను నిర్లక్ష్యంగా వదిలేశారని గుర్తు చేశారు.