వెలుగు లక్ష్మయ్యకు రూ. 60వేల సీ. ఎం. ఆర్ చెక్కు పంపిణీ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామానికి చెందిన వెలుగు లక్ష్మయ్య ఇటీవల చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు దృష్టికి వెళ్లడంతో, లబ్ధిదారుడికి రూ. 60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేశారు. మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు లబ్ధిదారుడు వెలుగు లక్ష్మయ్యకు ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కరివిరాల గ్రామ సర్పంచ్ మోర సంధ్య బిక్షం కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్