నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో వివక్షత చూపిస్తున్నారని బాధితులు శనివారం ఆరోపిస్తున్నారు. ఊట్కూర్ లో ఎటువంటి గ్రామ కమిటీ తీర్మానం లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇష్టానుసారంగా నచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.