శాలిగౌరారం: బండారు మల్లయ్య మృతి కాంగ్రెస్ కి తీరని లోటు

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉప్పులంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ దివంగత బండారు మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందుల సామేలు మాట్లాడుతూ, బండారు మల్లయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్