సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తుంగతుర్తి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ప్రభుత్వ పథకాలను వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉద్యోగ నియామకాలు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించాలని, గత హామీలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు.