సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ సభ ప్రాంగణం నుండి ప్రారంభించనున్నారు. సభకు పూర్తి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.