తిరుమలగిరి: ఉచితంగా సైక్లింగ్ నేర్పించే కార్యక్రమం

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో, ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మహిళా శక్తి కార్యక్రమంలో స్నేహ సంఘాల బాలికలకు ఉచిత సైక్లింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం 18 ఏళ్లలోపు బాలికల ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తుందని, బాలికలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎండిఓ, ఏపిఎం, ఎమ్మెస్ అధ్యక్షులు, సమైక్య సిబ్బంది, స్నేహ సంఘాల బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్