తుంగతుర్తి: జాతీయ రహదారిపై కమ్ముకున్న దట్టమైన పొగ మంచు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని జాతీయ రహదారి 365పై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్