సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జాతీయ రహదారి 365పై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.