తుంగతుర్తి: ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాకే ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గానుగుబండ గ్రామస్థులు అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించిన వారిపై అవినీతి ఆరోపణలు రావడంతో, ఇతర సంఘాలు బాధ్యతలు కోరాయి. అయితే, అధికారులు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికే బాధ్యతలు అప్పగించడంతో గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిశీలన అనంతరం, అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కాదని, ఇతర సంఘాల వారికి కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సోమవారం అధికారుల సమక్షంలోనే కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్