తుంగతుర్తి: కొండముచ్చులతో కోతుల పరార్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కొండముచ్చుల రాకతో కోతులు పరార్ అవుతున్నాయి. గత రెండు రోజులుగా కొండముచ్చులను తీసుకురావడంతో కోతులు పత్తా లేకుండా వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కోతుల బెడదతో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామానికి నాలుగు కొండముచ్చులను వదిలేస్తే కోతులు కనిపించకుండా పోతాయని, తమకు ఇబ్బందులు తొలగిపోతాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్