సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం నుండి కోర్టు వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆరోపించారు. పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ శుక్రవారం నాయకులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్రెడ్డి, సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, నాయకులు చింతకుంట్ల సురేష్, గోపగాని రమేష్, గోపగాని వెంకన్న, రాజేష్, విజయ్, మహిళలు పాల్గొన్నారు.