సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శ్రీ వాసవి వైశ్య సేవా సమితి, మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత దేవాలయం, శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయముల శంఖు స్థాపనలు ఘనంగా జరిగాయి. పెనుగొండ వాసవి శాంతి ధామం దేవాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతీ బాల స్వామి వారి ఆశీర్వాదంతో, వేద పండితులు మంత్రమూర్తి ఆదిత్య మూర్తి శర్మ, గంగాధర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా వాసవి మాత సేవా సమితి అధ్యక్షులు ఈగా దయాకర్ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.