తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మారగాని వెంకటయ్య

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారగాని వెంకటయ్య తండ్రి రాములుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పదవి లభించింది. రాములు కాంగ్రెస్ పార్టీలో గత 40 సంవత్సరాలుగా కార్యకర్తగా, వార్డు మెంబరు, సంగెం గ్రామ విద్యా కమిటీ చైర్మన్ గా, ఎంపీటీసీగా సేవలందించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శిష్యునిగా ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఎమ్మెల్యే సామేలు, గుడిపాటి నరసయ్య, చెవిటి వెంకన్న యాదవ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్