సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాలు తుంగతుర్తికి ఇచ్చిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో అడుగుపెట్టాలని శనివారం తెలియజేశారు. రేవంత్ రెడ్డికి తుంగతుర్తిలో అడుగుపెట్టే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.