ముంబయిలో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్ట్‌

మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) అధికారులు ముంబయిలో అనుమానిత జైషే మహమ్మద్‌ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేశారు. క్యాబ్‌ బుకింగ్‌ సంస్థలో బైక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ హసన్‌ అబు సర్మాద్‌ అక్తర్‌ను మహిమ్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో తీవ్రవాద కంటెంట్‌ వ్యాప్తి చేస్తూ, మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయని అధికారులు తెలిపారు. నిషేధిత జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన హ్యాండ్లర్లు, పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌లతో అతడికి సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕