ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడం అన్యాయం: హరీష్ రావు

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తుండగా, వడ్లు కొనాలని చెప్పినందుకు అశోక్‌ను విధుల నుండి తొలగించారని తెలిపారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అశోక్ మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. వెంటనే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయపోరాటం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్