TG: తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఒకరోజు పాటు మండలి నుంచి సస్పెండ్ చేస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాలు జారి చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మండలి నుంచి సభ్యులు సస్పెండ్ కావడం ఇదే తొలిసారి. చైర్మన్ సస్పెండ్ చేసినా సభలోనే ఉండి మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని BRS సభ్యులు డిమాండ్ చేశారు.