కొడుకు మృతిపై అనుమానం.. తల్లి ఫిర్యాదుతో?

AP: అనకాపల్లి జిల్లా సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) ఫిబ్రవరి 28న ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. గుండెపోటుతో షేక్ ఖాన్ చనిపోయినట్లు భార్య తెలిపింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి సైదుబేబీ ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఖననం చేసిన షేక్ ఖాన్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్