గౌహతి యూనివర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

అస్సాంలోని గౌహతి అజారా ప్రాంతంలో ఉన్న హోమ్‌స్టేలో 22 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థిని నిమిషా ఠాకూరియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమెతో ఉన్న ఆసిఫ్ అలీ అనే వ్యక్తి చెప్పగా, పోలీసులు అతని వ్యాఖ్యలను ప్రాథమికంగా ఆమోదించలేదు. అపస్మారక స్థితిలో ఉన్న నిమిషాని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕