సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న లాస్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.