హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో స్విమ్మింగ్ పూల్‌లో తల్లీ, ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. భర్త అజారుద్దీన్ ప్రమాదవశాత్తు పూల్‌లో పడి చనిపోయారని చెబుతుండగా, దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో స్విమ్మింగ్ పూల్‌ను అద్దెకు ఇచ్చి జీవనం సాగిస్తున్న ఈ దంపతుల ఇంట్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.