లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో రేణుక అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్తకు దూరంగా ఉంటున్న రేణుక.. ఫరూక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. గురువారం రాత్రి ఫరూక్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు ఆమె ఒక వ్యక్తితో మాట్లాడి, స్నేహితురాలికి వీడియో కాల్ చేసి, తన మరణమే బర్త్ డే గిఫ్ట్ అని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, రేణుక కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. గోల్కొండ పోలీసులు ఫరూక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్