భార్యపై అనుమానం.. ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపిన భర్త

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో పర్గుండ సరవాద్‌ అనే వ్యక్తి తన భార్య శోభ(35)ను అతి కిరాతకంగా హత్య చేశాడు. మద్యం సేవించి వచ్చిన పర్గుండ సరవాద్‌ రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శోభ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్