భార్యపై అనుమానం.. 14 సార్లు కత్తితో పొడిచిన భర్త

AP: భార్యపై అనుమానంతో ఓ సహాయ లోకో పైలట్‌ అమానుషానికి పాల్పడ్డాడు. గర్భిణి అన్న సంగతిని కూడా మరిచి కత్తితో దారుణంగా దాడి చేశాడు. శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైల్వే శాఖలో పనిచేస్తున్న ఎం.వెంకటశేషగిరిరావు రెండో భార్య కరుణపై అనుమానం పెంచుకుని ఆమెను ఏకంగా 14 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్