మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల కోలార్ ప్రాంతం, డానిష్ కుంజ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఒక ఎస్యూవీ కారు.. అక్కడ ఆగి ఉన్న మరొక కారును బలంగా ఢీకొట్టి, ఆపై పక్కనే ఉన్న పేపర్ బాయ్ స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 36 ఏళ్ల పేపర్ బాయ్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. అజాగ్రత్తతో కూడిన డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.