పక్కా ప్రణాళికతోనే.. పీఏ హత్యపై సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ హత్యకు గురయ్యారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని, హంతకులు రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని సువేందు అధికారి ఆరోపించారు. ఈ ఘటనపై బెంగాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సిద్ధ్‌నాథ్‌ గుప్తా సమగ్ర విచారణకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. రథ్‌ ప్రయాణిస్తున్న కారును వెంబడించి, కిటికీలోంచి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్