కుటుంబ కథా చిత్రాలతో విజయాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా "వేదవ్యాస్" ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం కానున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో "వేదవ్యాస్" మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినందుకు గాను ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.