స్వర్ణ Vs కొండా.. ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో పూల దండ లొల్లి (వీడియో)

వరంగల్ జిల్లాలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ, డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాశీబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించే సమయంలో ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను కొండా సురేఖ తీసివేయించి, తాను వేసిన పూలమాలతో నివాళులర్పించారు. ఈ సంఘటనతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరింత స్పష్టమైంది. వర్ధంతిని వేర్వేరుగా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్