ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో రంగం ఆరంభమైంది. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని దేవాలయంలో భక్తులతో సందడి నెలకొంది.