స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకల వేళ తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. క్రాన్స్ మోంటానా పట్టణంలోని ఓ బార్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బార్ అంతటా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నాయి.