పాలజ్వరంతో బాధపడే పశువుల్లో మొదట మేత వేయకపోవడం, నెమరు వేయకపోవడం, బెదురు చూపులు, వణుకులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో నిలబడలేకపోవడం, శ్వాస, నాడి వేగం తగ్గిపోవడం జరుగుతుంది. తలను పొట్టపై ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం ప్రత్యేక లక్షణం. మూడో దశలో శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోతుంది. ఒకవైపు పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తగిన వైద్యం లేకుంటే మరణం సంభవించవచ్చు.