భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో నమోదైన సంచలన రికార్డులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 253, ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగా, ఇరు జట్లు కలిసి 499 పరుగులు, 73 బౌండరీలు (34 సిక్సర్లు, 39 ఫోర్లు) బాదాయి. సంజూ శాంసన్ 89, జాకబ్ బెథెల్ 105 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోరు 517 (వెస్టిండీస్-దక్షిణాఫ్రికా, 2023) కాగా, ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును 18 పరుగుల తేడాతో అందుకోలేకపోయారు. తాజా సిరీస్‌లోనూ పిచ్‌లు అనుకూలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.