టీ20 వరల్డ్ కప్ కోసం మ్యాచ్ అధికారుల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్ గ్రూప్ దశలకు 24 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ అంపైర్లు కూడా ఉన్నారు. గ్రూప్ దశల్లో నలుగురు భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు, ఇద్దరు బంగ్లాదేశీ అంపైర్లు వ్యవహరించనున్నారు. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్థాన్-నెదర్లాండ్ మధ్య జరగనుంది.