భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ప్రైజ్ మనీ

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఐసీసీ ప్రైజ్ మనీని 20 శాతం పెంచింది. మొత్తం ప్రైజ్ పూల్ $11.25 మిలియన్ల నుంచి $13.5 మిలియన్లకు (సుమారు రూ. 120.37 కోట్లు) పెరిగింది. విజేత జట్టుకు $3 మిలియన్లు (సుమారు రూ. 27.48 కోట్లు), రన్నరప్ జట్టుకు $1.6 మిలియన్లు (సుమారు రూ. 14.65 కోట్లు) లభిస్తాయి. సెమీఫైనలిస్టులకు ఒక్కొక్కరికి $7,90,000, 5-12 స్థానాల్లో నిలిచే జట్లకు ఒక్కొక్కరికి $3,80,000, 13-20 స్థానాల్లో నిలిచే జట్లకు $2,50,000 లభిస్తాయి. ఈ పెంపు చిన్న జట్లకు కూడా ఆర్థికంగా ఊరటనిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్