టీ20 వరల్డ్ కప్.. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ వార్మప్ మ్యాచ్‌

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు జరగనుండగా, భారత జట్టు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో, పాకిస్థాన్ జట్టు సాయంత్రం 5 గంటలకు ఐర్లాండ్‌తో తలపడనుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, పాకిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతుంది. అయితే, మైదానం బయట భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను పీసీబీ బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి వార్మ్-అప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్