ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే జట్టు కూర్పు, మైదాన పరిస్థితులపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని కీలక సవాళ్లను లేవనెత్తారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఎంపికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది జట్టులో సర్దుబాటు చేయడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా లేదా ఒక సీమర్‌ను తగ్గించి రిస్క్ తీసుకోవాలా అన్నది సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు.