నాగార్జున 100వ చిత్రంలో టబు విలన్?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం 'కింగ్ 100'(వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతోంది. రా కార్తీక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు హీరోయిన్‌గా కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నాగార్జునను ఢీకొట్టే లేడీ విలన్‌గా ఆమె నటన ఆకర్షణగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. జూలై 10వ తేదీ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడిస్తానని నాగార్జున హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్