సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తాయ్ కిళవి’ ఏప్రిల్ 10 నుంచి 'జియో హాట్‌స్టార్' సింప్లీ సౌత్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శివకార్తికేయన్ నిర్మించిన ఈ కామెడీ డ్రామాలో రాధిక 63 ఏళ్ల వయసులో వృద్ధురాలి పాత్రలో నటించారు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.