చైనా వైపు రాకెట్లను ప్రయోగించిన తైవాన్‌

యుద్ధ సన్నాహక కార్యక్రమంలో భాగంగా, తైవాన్ సైన్యం 'షూట్ అండ్ స్కూట్' మొబైల్ లాంచర్ల నుంచి చైనా వైపు పలు రాకెట్లను ప్రయోగించినట్లు ప్రకటించింది. డ్రాగన్ దేశం దండెత్తితే ఎలా ఎదుర్కొంటామో చూపించేందుకే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపింది. అమెరికా సరఫరా చేసిన హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టం (హైమార్స్)ను ఉపయోగించి, రాకెట్లను తైవాన్ జలసంధిలో ప్రయోగించడం ఇదే మొదటిసారి. 'తైవాన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి హైమార్స్ వ్యవస్థపై నిరంతరం శిక్షణ పొందుతున్నాం' అని ఆర్మీ సర్జెంట్ వాంగ్ మింగ్ హుయ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్