తాజ్ మహల్ లోపల 'తేజో మహాలయ' ఆలయం ఉందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆగ్రా జిల్లా కోర్టు సర్వేకు అనుమతి నిరాకరించడంతో, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం, ఏఎస్ఐల స్పందన ఆధారంగా తాజ్ మహల్ లోపల సర్వేకు అనుమతిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.