SLBC టన్నెల్‌ పనులకు రోబోల సాయం తీసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి

TG: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల్లో మనుషులు, యంత్రాలతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. సీఎం రేవంత్ ఆదివారం దోమలపెంటలోని SLBC టన్నెల్‌లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ దుర్ఘటన అనుకోకుండా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్