లాంటానా (తలంబ్రాల చెట్టు / అత్తాకోడళ్ల చెట్టు) మొక్కలో అనేక అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క చర్మ సమస్యలైన గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆముదంతో కలిపి పూతలా రాస్తే మోకాళ్లు, కీళ్లు, వెన్నునొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దోమలను తరిమికొట్టడం, గొంతు నొప్పి, పంటినొప్పి, అజీర్ణం తగ్గించి ఆకలి పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది.