TG: ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబసభ్యులను MLA, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు శనివారం పరామర్శించారు. శుక్రవారం కిడ్నీ సంబంధిత వ్యాధితో వెంకట్ మరణించిన సంగతి తెలిసిందే. వెంకట్ ఆత్మకు శాంతి చేకూరాలని తలసాని కోరారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.