TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు. 'నోరుందని ఇష్టానుసారం మాట్లాడితే సహించం. తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలైంది. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముక్కలు, చెక్కలు చేసిన విషయం తలసాని మరిచిపోయాడా? పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.